సంగారెడ్డి జిల్లా జైలు(Sangareddy district jail news)లో ఒకే సారి ఐదుగురు ఉద్యోగులను బదిలీ చేయటం చర్చనీయాంశమైంది. విచారణ ఖైదీల నుంచి ఉద్యోగులు లబ్ధి పొందుతున్నారంటూ ఆరోపణలు(Transfer allegations) వచ్చిన నేపథ్యంలో.... వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. బెంగళూరుకి చెందిన ఓ విచారణ ఖైదీ ఇద్దరు అధికారులకు కొత్త వాహనాలు కొనిచ్చారని ప్రచారం జరిగింది. అతడితో పాటు మరికొందరికి అనుకూలంగా వ్యవహరించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. స్వయంగా విచారించిన డీఐజీ మురళి బాబు అలాంటిదేమీ లేదని స్పష్టతనిచ్చారు.
అవన్నీ పుకార్లే..
జైలు(Sangareddy district jail news)లో అవినీతి జరుగుతోందని ప్రచారం సాగడం... డీఐజీ మురళి బాబు ఈ నెల 16న సంగారెడ్డి జైలుకు రావడంతో.. ఇక్కడ ఏదో జరుగుతోందనే చర్చ మొదలయింది. కానీ అలాంటిదేమీ లేదని ఆయనే స్పష్టతనిచ్చారు. కేవలం ఇద్దరు అధికారుల మధ్య అవగాహన లోపం వల్లే సమస్య వచ్చిందన్నారు. అవినీతి ఆరోపణలు కేవలం పుకార్లేనని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే జైళ్ల శాఖ ఇంఛార్జి డీజీ జితేందర్ ఇక్కడ పని చేస్తున్న ఇద్దరు జైలర్లు, ముగ్గురు వార్డర్లను ఇతర చోట్లకు బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.