తెలంగాణ

telangana

ETV Bharat / state

పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్​ - సుల్తాన్​పూర్ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన సంగారెెడ్డి కలెక్టర్​

విధుల్లో నిర్లక్ష్యం వహించిన క్రిష్ణారెడ్డిపేట్​ పంచాయతీ కార్యదర్శిని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో విఫలమైనందుకు గ్రామ సర్పంచ్​పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు.

sangareddy District Collector who suspended the sulthanpur  Panchayat Secretary
పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్​

By

Published : Feb 26, 2021, 12:18 PM IST

అక్రమనిర్మాణాలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యం వహించిన సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మండలం క్రిష్ణారెడ్డిపేట్​ పంచాయతీ కార్యదర్శిని జిల్లా కలెక్టర్​ హనుమంతరావు సస్పెండ్​ చేశారు. ఈ వ్యవహారంలో సర్పంచ్​పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేశారు.

జిల్లాలోని క్రిష్ణారెడ్డిపేట్ గ్రామం పరిధిలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వాటిని అడ్డుకోవాల్సిన పంచాయతీ కార్యదర్శి సుధీర్​ రెడ్డి పట్టించుకోలేదు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను సదరు కార్యదర్శిని సస్పెండ్​ చేశారు. గ్రామ సర్పంచ్​ క్రిష్ణను విధుల నుంచి ఎందుకు తొలగించకూడదో తెలపాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి:శివారు పురపాలికల్లో జోరుగా అక్రమ నిర్మాణాలు

ABOUT THE AUTHOR

...view details