తెలంగాణ

telangana

ETV Bharat / state

నిబంధనలు పాటించని పలు ప్రైవేటు కొవిడ్​ ఆస్పత్రులపై చర్యలు - సంగారెడ్డి తాజా వార్తలు

కొవిడ్​ చికిత్స పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్న సంగారెడ్డిలోని పలు ప్రైవేటు ఆస్పత్రులపై జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయా ఆస్పత్రుల్లో కొవిడ్​ చికిత్స అనుమతులు రద్దు చేస్తూ కలెక్టర్​ ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ వార్తలు
సంగారెడ్డి వార్తలు

By

Published : May 21, 2021, 10:05 AM IST

సంగారెడ్డి జిల్లాలోని పలు కొవిడ్​ ఆస్పత్రులపై జిల్లా కలెక్టర్​ చర్యలు తీసుకున్నారు. రెమ్​డెసివిస్​ ఇంజక్షన్ల విషయంలో కొవిడ్​ బాధితులను ఇబ్బంది పెడుతున్నాయన్న ఆరోపణలపై ఆస్పత్రులకు కొవిడ్​ చికిత్స అనుమతులను రద్దు చేశారు.

జిల్లా కేంద్రంలోని శ్రీ కేతన ఆస్పత్రిలో ఇంజక్షన్ల వ్యవహారంపై వచ్చిన ఆరోపణలు రుజురు కావడం వల్ల చర్యలు తీసుకున్నారు. పద్మావతి ఆస్పత్రికి నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ఇతర ఆస్పత్రులకు మెమోలు జారీ చేశారు.

ఇదీ చూడండి:కరోనా సెకండ్‌వేవ్‌లో 10శాతం వరకు చిన్నారులపై ప్రభావం

ABOUT THE AUTHOR

...view details