సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అలియబాద్ గ్రామంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. మొక్కలు నాటి అనంతరం గ్రామంలోని అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.
'మొక్కలు నాటడమే కాదు... పెంచే బాధ్యత కూడా మనదే' - హరితహారంలో పాల్గొన్న సంగారెడ్డి కలెక్టర్
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి... వృక్ష సంపదను పెంచాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సూచించారు. హరితహారంలో పాల్గొని ఆయన మొక్కలు నాటారు.
'మొక్కలు నాటడమే కాదు... పెంచే బాధ్యత కూడా మనదే'
ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని... వృక్ష సంపదను పెంచాలని కలెక్టర్ కోరారు. చెట్లు మన ఆరోగ్య రక్షణకు తోడ్పడతాయన్నారు. అడవులు ఎక్కువ ఉన్న చోట వర్షపాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంటలు విస్తారంగా పండుతాయని తెలిపారు. మొక్కలు నాటాడమే కాకుండా వాటిని కాపాడాల్సిన బాధ్యత మనదేనని కలెక్టర్ పేర్కొన్నారు.