సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వైకుంటపురంలో గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఎనిమిదో వార్షికోత్సవం ఘనంగా జరిపారు. ఉత్సవాల్లో భాగంగా సుదర్శన యాగం, చక్ర స్నాన కార్యక్రమాలు నిర్వహించారు. వైభవంగా జరిగిన వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్వామి వారికి చక్ర స్నానం చేసిన తర్వాత భక్తులు గుండంలో స్నానం చేశారు. శ్రీ వెంకటేశ్వరుడికి వెండి కళాశాల్లో పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ప్రజలు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని అర్చకులు ఆకాంక్షించారు.