తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం' - సంగారెడ్డి కరోనా కేసులు

కరోనా బారిన పడి రోజుకు వేల మంది ప్రాణాలు కోల్పోతున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎలాంటి చలనం లేదని సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల మండిపడ్డారు. ప్రతి పౌరునికి టీకాలు ఉచితంగా వేయాలంటూ కలెక్టరేట్​లో వినతి పత్రాన్ని అందజేశారు. కొవిడ్ కట్టడి పట్ల సరైన జాగ్రత్తలు చేపట్టకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆమె హెచ్చరించారు.

Sangareddy dcc
Sangareddy dcc

By

Published : Jun 4, 2021, 3:31 PM IST

కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల మండిపడ్డారు. మహమ్మారి వల్ల దేశంలో ఎన్నో కుటుంబాలు అతలాకుతలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పౌరునికి టీకాలు ఉచితంగా వేయాలంటూ కలెక్టరేట్​లో వినతి పత్రాన్ని అందించారు.

ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే డిజిటల్ డివైడ్​ను సృష్టించిందని నిర్మల అన్నారు. తద్వారా టీకాలు వేయడంలో ఆలస్యమవుతోందన్నారు. వ్యాక్సినేషన్ కోసం ధరల వ్యత్యాసాలతో స్లాబ్​లు రూపొందించి అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు. కరోనా కట్టడి పట్ల సరైన జాగ్రత్తలు చేపట్టకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆమె హెచ్చరించారు.

ఇదీ చదవండి:Eatala: వారం రోజుల్లో దిల్లీ వెళ్లి భాజపాలో చేరుతా: ఈటల

ABOUT THE AUTHOR

...view details