తెలంగాణ

telangana

ETV Bharat / state

దళారుల నుంచి రైతులను కాపాడాలి: నిర్మలా రెడ్డి - సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు మౌనదీక్ష

సంగారెడ్డిలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి ఆధ్వర్యంలో ఒకరోజు మౌనదీక్ష చేపట్టారు. రైతు పండించిన పంటను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసి, దళారుల అన్యాయాలు అరికట్టాలని డిమాండ్ చేశారు.

sangareddy dcc president nirmala reddy one day silent strike on farmers problems
దళారుల నుంచి రైతులను కాపాడాలి: నిర్మలా రెడ్డి

By

Published : May 5, 2020, 6:51 PM IST

కరోనా కష్ట కాలంలో రైతులను ప్రభుత్వం ఆదుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా రెడ్డి వ్యాఖ్యానించారు. టీపీసీసీ పిలుపు మేరకు రైతు సమస్యలపై ఒకరోజు మౌనదీక్ష చేపట్టారు. రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడ్డవారిని ఆదుకోవాలని కోరారు.

రైతు పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి, దళారుల నుంచి కాపాడాలన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన వారికి పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:'మీడియా సిబ్బంది భద్రతపై ప్రభుత్వం ఆందోళన'

ABOUT THE AUTHOR

...view details