తెలంగాణ

telangana

ETV Bharat / state

సంక్షేమాన్ని చూసి ఇతరపార్టీల వారు తెరాసలోకి వస్తున్నారు: హరీశ్​రావు - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

సంగారెడ్డిలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెరాసలో చేరారు. పట్టణంలోని ఓ ఫంక్షన్​హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో తెరాస కండువా కప్పుకున్నారు.

Congress leaders joining in Trs in the presence of Minister Harish Rao
మంత్రి హరీశ్​రావు సమక్షంలో తెరాసలో చేరిన హస్తం నేతలు

By

Published : Jun 23, 2020, 4:33 PM IST

రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నేతలు తెరాసలో చేరుతున్నారని హరీశ్​రావు తెలిపారు.

సంగారెడ్డిలో 400 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలకు కండువాలు కప్పి మంత్రి తెరాసలోకి ఆహ్వానించారు. దేశంలోని ఇతర ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని తమ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలని హరీశ్​రావు సూచించారు.

ఇదీ చూడండి :జగన్నాథ రథయాత్ర చరిత్రలో తొలిసారి ఇలా...

ABOUT THE AUTHOR

...view details