గడువులోపు డంప్ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణం పూర్తి చేయని గ్రామ సర్పంచులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావు హెచ్చరించారు. ఈ నెల 15 నాటికి వందశాతం నిర్మాణ పనులు పూర్తి చేయాలని గడువు విధించిన కలెక్టర్ రోజువారీగా ప్రగతిని సమీక్షిస్తున్నారు.
'పనులు సకాలంలో పూర్తి చేయకుంటే చర్యలు తప్పవు' - సంగారెడ్డి కలెక్టర్ వార్తలు
సంగారెడ్డి జిల్లా కంది, హత్నార మండలాల్లోని గ్రామాల్లో డంప్ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాల పనులను కలెక్టర్ హన్మంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గడువులోపు నిర్మాణ పనులను పూర్తి చేయని సర్పంచులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోజువారీగా ప్రగతిని సమీక్షిస్తున్నారు.
sangareddy collector
గడువులోపు పనులు పూర్తి చేయడానికి రాత్రి, పగలు పనులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బుధవారం రాత్రి కంది, హత్నూర మండలాల్లోని గ్రామాల్లో ఆకస్మికంగా పనులను తనిఖీ చేశారు.
ఇదీ చదవండి :పద్మారావుకు కరోనాపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు