ఆడపిల్ల పుట్టినప్పటినుంచి.. పెళ్లై, డెలివరీ అయ్యేంత వరకూ పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహిస్తోందని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. కంది మండలం ఎద్దు మైలారంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. మహిళా సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
'ఆడపిల్లల పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహిస్తోంది.. బాధేందుకు?' - మహిళా సంక్షేమ కార్యక్రమాలు
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దు మైలారంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జడ్పీ ఛైర్పర్సన్ మంజుశ్రీ హాజరయ్యారు.
'ఆడపిల్లల పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహిస్తోంది.. బాధేందుకు?'
అమ్మాయి పుట్టిందని బాధపడకుండా.. వారిని అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేయాలని కలెక్టర్ కోరారు. మహిళలు ఉన్నత స్థాయికి ఎదిగి.. పురుషులతో సమానంగా ముందుకు సాగాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ మంజుశ్రీ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:నా భర్త హోమో సెక్సువల్... అందుకే అలా చేశా!