డంపు యార్డు, వైకుంఠధామాల నిర్మాణాలు నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులు, సర్పంచ్‌లపై చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని రామతీర్థం గ్రామపంచాయతీని స్థానిక అధికారులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. పనుల పురోగతిని పరిశీలించిన జిల్లా పాలనాధికారి.. జాప్యం చేస్తే సహించబోమని హెచ్చరించారు.
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ - sangareddy news
సంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో కలెక్టర్ హనుమంతరావు పర్యటించారు. అభివృద్ధి పనులు పరిశీలించిన కలెక్టర్... అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం చేస్తే సహించబోమని హెచ్చరించారు.

sangareddy collector hanumatharao fire on village officers
ఆయా మండలాల్లో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతిరోజూ పనుల పురోగతి మెరుగుపడేలా చూడాలన్నారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి పనులను పరిశీలించారు. సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామంలో పారిశుద్ధ్య, హరితహారం పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి పంచాయతీ కార్యదర్శి రమేశ్‌కు షోకోజ్ నోటీసు జారీచేశారు.