తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు వేదికలు, ప్రకృతి వనాల నిర్మాణంలో జాప్యం.. కలెక్టర్ ఆగ్రహం - రైతు వేదికల పనుల పరిశీలించిన కలెక్టర్ హనుంతరావు

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, రాయికోడ్, మునిపల్లి మండలాల్లో కలెక్టర్​ హనుమంతారావు పర్యటించారు. గ్రామాల్లో చేపడుతున్న రైతు వేదికల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాల పనులను సందర్శించారు. పనులు పూర్తి చేయని గుత్తేదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

sangareddy collector hanumantharao visitation in various villages
రైతు వేదికలు, ప్రకృతి వనాల నిర్మాణంలో జాప్యం.. కలెక్టర్ ఆగ్రహం

By

Published : Sep 15, 2020, 5:14 PM IST

రైతు వేదికల నిర్మాణంలో జాప్యాన్ని సహించేది లేదని సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ఝరాసంగం, రాయికోడు, మునిపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో రైతు వేదికల, పల్లె ప్రకృతి వనాల పనులను సందర్శించారు. ఝరాసంగం మండలం జీర్లపల్లిలో రైతు వేదిక నిర్మాణం పునాది స్థాయిలోనే ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 15 లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

పనుల పూర్తి చేయకపోవడం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన గుత్తేదారుపై మండిపడ్డారు. గ్రామ సర్పంచి, ఎంపీటీసీ సభ్యులు పర్యవేక్షిస్తూ పనులు పూర్తయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. రాయికోడ్​లో పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి స్థానిక సర్పంచ్​తో కలిసి మొక్కలు నాటారు. నాటిన మొక్కలని సంరక్షిస్తూ... హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు.

ఇదీ చూడండి:నెలాఖరులోగా రైతు నిర్మాణ వేదికల్ని వినియోగంలోకి తేవాలి : కలెక్టర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details