ప్రతిఒక్కరూ పది మొక్కలు నాటాలి.. సంరక్షించాలి: కలెక్టర్ - haritha haaram
ప్రతిఒక్కరూ 10 మొక్కలు నాటి హరితహారాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో సిబ్బందితో కలిసి ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
![ప్రతిఒక్కరూ పది మొక్కలు నాటాలి.. సంరక్షించాలి: కలెక్టర్ sangareddy collector hanumantharao started 6th phase haritha haaram program](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7765633-379-7765633-1593081242167.jpg)
'ప్రతీ ఒక్కరు 10 మొక్కలు నాటి, సంరక్షించాలి'
సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఆవరణలో ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించారు. కలెక్టర్‌తోపాటు కార్యాలయ సిబ్బంది మొక్కలను నాటి నీరు పోశారు. ప్రతిఒక్కరూ 10 మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ హనుమంతరావు కోరారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు. ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేశామన్న కలెక్టర్... హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.