సంగారెడ్డి జిల్లా కేంద్రం ప్రధాన రహదారిపై తిరుగుతున్న వాహనదారులను ఆపి.. రోడ్లపైకి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు కలెక్టర్ హనుమంతరావు. ఇష్టారీతిగా రోడ్లపై తిరుగుతున్న వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అకారణంగా రోడ్ల మీదికి వచ్చిన వారి వాహనాలను సీజ్ చేయించారు. కాలక్షేపానికి రోడ్డపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనాను అరికట్టడంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రజలే నిర్లక్ష్యంగా బయట తిరగడం బాధాకరమని... ఇటువంటి వారి వల్లే కరోనా విజృంభనకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాస్కులు లేకుండా వచ్చిన వారికి స్వయంగా మాస్కులు అందించారు. మరోసారి మాస్కులు లేకుండా వస్తే జరిమానా విధించాలని ఆధికారులకు సూచించారు.
నిబంధనలు అతిక్రమిస్తే భారీ మూల్యం తప్పదు: కలెక్టర్ - warring to Seemingly come on roads and Permission to seize to vehicles
కారణం లేకుండా రోడ్లపై తిరిగి కరోనా వ్యాప్తికి కారకులు కావద్దని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రజలకు సూచించారు. కరోనా నేపథ్యంలో మాస్కులు లేకుండా కనిపించినా.... అనవసరంగా రోడ్డపై తిరిగిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిబంధనలు అతిక్రమిస్తే భారీ మూల్యం తప్పదు: కలెక్టర్