తెలంగాణ

telangana

ETV Bharat / state

దొడ్డు రకం వద్దు... సన్న రకం ముద్దు: కలెక్టర్ - దొడ్డు రకం వద్దు... సన్న రకం ముద్దు

నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్​ హనుమంతరావు రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సారి దొడ్డు రకం కన్నా సన్నరకం బియ్యం లేదా పత్తిని సాగుచేసుకోవచ్చునని తెలిపారు.

Sangareddy collector Hanumantha rao visiting Danampalli Village
దొడ్డు రకం వద్దు... సన్న రకం ముద్దు

By

Published : May 26, 2020, 2:48 PM IST

నూతన నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై సంగారెడ్డి జిల్లా ఆలూరు మండలం దానంపల్లిలో రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్​ హనుమంతరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పంటలు వేసే విధానంపై ఆయన రైతులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. దొడ్డు రకం కన్నా సన్నరకం బియ్యానికి విపణిలో మంచి డిమాండ్ ఉందని వెల్లడించారు.

లేకపోతే పత్తిని వేసుకోవచ్చునని ఆయన సూచించారు. జిల్లాలోని 116 క్లస్టర్లలో రైతుల సమావేశం జరుగుతున్నాయని తెలిపారు. అన్నదాతల అభీష్టం మేరకే పంటలను వేయాలని ఆయన వెల్లడించారు. వానాకాలం పంటలకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details