సంగారెడ్డి జిల్లాలో ఉన్న తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన మొగుడంపల్లి మండలం మాడిగి, న్యాల్కల్ మండలం హుసెళ్లి అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద లాక్‌డౌన్ అమలును జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి వస్తున్న నిత్యావసర సరకు రవాణా వాహనాల డ్రైవర్లకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే జిల్లాలోకి అనుమతించాలని ఆదేశించారు.
లాక్‌డౌన్ మరింత పటిష్ఠంగా అమలు: కలెక్టర్ - collector hanumantha rao visited state border check posts in sangareddy district
అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో లాక్‌డౌన్‌ను మరింత పటిష్ఠంగా అమలు చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆధికారులను ఆదేశించారు. జిల్లా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద లాక్‌డౌన్ అమలు తీరును కలెక్టర్ పరిశీలించారు.
![లాక్‌డౌన్ మరింత పటిష్ఠంగా అమలు: కలెక్టర్ sangareddy-collector-hanumantha-rao-visited-state-border-check-posts-in-sangareddy-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6843403-thumbnail-3x2-srd-colletcor.jpg)
లాక్‌డౌన్ మరింత పటిష్ఠంగా అమలు: కలెక్టర్
అనంతరం జహీరాబాద్ పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన కాలనీలో పర్యటించి అక్కడి పరిస్థితిని ఆర్డీఓ రమేష్ బాబును అడిగి తెలుసుకున్నారు. ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:అనుమానాల్లేవ్... కరోనాపై విజయం తథ్యం