తెలంగాణ

telangana

By

Published : Sep 1, 2020, 5:30 PM IST

ETV Bharat / state

ఉన్నతమైన విద్యను అందించాలి: కలెక్టర్​

ఉపాధ్యాయులు డిజిటల్ విధానంలో ఉన్నతమైన విద్యను విద్యార్థులకు అందించాలని సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పఠాన్​చెరు మండలం రుద్రారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు.

sangareddy collector hanumantha rao visit zp school for digital clasess
ఉన్నతమైన విద్యను అందించాలి: కలెక్టర్​

సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు పఠాన్​చెరు మండలం రుద్రారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న డిజిటల్ తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలలో డిజిటల్ తరగతి ద్వారా విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించే విధంగా కృషిచేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

కచ్చితంగా సమయ పాలన పాటించాలని, లేనిచో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి డిజిటల్ విధానంలో బోధన ఎలా సాగుతుందో అడిగి తెలుసుకోవాలన్నారు. విద్యార్థులు ఆన్​లైన్​ తరగతుల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు.

ఇవీచూడండి:యువకుడి మృతి... కార్పొరేటర్​పై బంధువుల దాడి

ABOUT THE AUTHOR

...view details