తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ - సంగారెడ్డి జిల్లా కలెక్టర్​ హనుమంతరావు

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. రేజింతల్​లో వైకుంఠధామం, డంపింగ్​ యార్డ్​ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Sangareddy collector tour in Reginthal village observe the development works
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు

By

Published : Jul 12, 2020, 5:19 PM IST

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామంలో కలెక్టర్​ హనుమంతరావు పర్యటించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్, వైకుంఠధామం నిర్మాణ పనులను పరిశీలించారు. డంపింగ్ యార్డ్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు సరిగా లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా వేయకుండా ఇష్టారాజ్యంగా నిర్వహించడంపై మండిపడ్డారు.

ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకుండా ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మార్గమధ్యలో నారింజ సాగునీటి ప్రాజెక్టును సందర్శించారు. ఇటీవల రూ.50 లక్షలతో చేపట్టిన మరమ్మతులు పూడికతో నీరు సమృద్ధిగా చేరడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details