నియంత్రిత సాగు విధానంలో రైతు వేదికల పాత్ర కీలకమని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. జహీరాబాద్ మండలం రంజోల్, చిన్న హైదరాబాద్ గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఆయన పరిశీలించారు.
రెండు నెలల్లో రైతు వేదికలు నిర్మించాలి: కలెక్టర్ - సంగారెడ్డిలో రైతు వేదికల నిర్మాణాలు
రైతుల అభ్యున్నతి కోసమే రైతు వేదికల నిర్మాణాలను చేపడుతున్నట్లు కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. రెండు నెలల్లో వీటి నిర్మాణాలు పూర్తి చేసి సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు చేయాలని సూచించారు.
రెండు నెలల్లోపు రైతు వేదికలను నిర్మించాలి
రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి స్థలాల ఎంపిక పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. రెండు నెలల్లో రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేసి సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు చేయాలని సూచించారు.