సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, రామచంద్రపురం మండలాల్లోని లక్డారం, నందిగామ, వెలిమెల గ్రామాల్లో జిల్లా పాలనాధికారి హనుమంతరావు ఆకస్మికంగా పర్యటించారు. రైతు వేదికల పురోగతిని పరిశీలించారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు.
రైతు వేదికలు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ హనుమంతరావు - సంగారెడ్డి జిల్లా వార్తాలు
రైతు వేదికల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు అధికారులను ఆదేశించారు. పటాన్చెరు, రామచంద్రపురం మండలాల్లోని లక్డారం, నందిగామ, వెలిమెలలో ఆకస్మికంగా పర్యటించారు. రైతు వేదికల పురోగతిని పరిశీలించారు.
రైతు వేదికలు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ హనుమంతరావు
నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా రైతు వేదికలను పూర్తిచేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. జాప్యం లేకుండా, త్వరితగతిన పనులు పూర్తయ్యేలా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
ఇదీ చదవండి-బంగాల్ బరి: 'మోదీ' అస్త్రంతోనే దీదీపై గురి!