తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోం' - bjp leaders fire on cm kcr

సంగారెడ్డిలో భాజపా ఆధ్వర్యంలో కేంద్ర నాయకుల చిత్రపటాలకు పూలాభిషేకం చేశారు. పోతిరెడ్డిపాటు విషయంలో స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోమని భాజపా నాయకులు తెలిపారు.

sangareddy bjp leaders praises central bjp leaders
'రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోం'

By

Published : May 17, 2020, 4:16 PM IST

పోతిరెడ్డిపాడు విషయంలో కలుగజేసినందుకు గానూ... సంగారెడ్డిలో జిల్లా శాఖ భాజపా ఆధ్వర్యంలో కేంద్ర నాయకుల చిత్రపటాలకు పూలభిషేకం చేశారు. పోతిరెడ్డిపాడు విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. జల దోపిడీ జరుగుతుంటే సీఎం కేసీఆర్ మౌనంగా ఉండటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాయకులు ధర్నాలు, ర్యాలీలు చేస్తే స్పందించే సీఎం కేసీఆర్​... ఇంత నీటి దోపిడీ జరుగుతుంటే ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రా భాజపా నాయకులు రాసిన ఉత్తరం వల్ల తెలంగాణ ప్రజలకు ఊపిరి అందించిందన్నారు. అపెక్స్ మీటింగ్ తర్వాత తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని భాజపా నాయకులు తెలిపారు.

ఇదీ చదవండి:శంషాబాద్​ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details