ప్రజల ఆహ్లాదం కోసం ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తోందని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లో పర్యటించి హోతి(కే), పర్వతాపూర్, మొగుడంపల్లి గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూమిని పరిశీలించారు.
పల్లె ప్రకృతి వనాల కోసం భూమిని పరిశీలించిన అదనపు కలెక్టర్ - సంగారెడ్డి జిల్లా వార్తలు
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, మెుగుడంపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా పర్యటించారు. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం అవసరమైన ప్రభుత్వ భూమిని పరిశీలించారు.
పల్లె ప్రకృతి వనాల కోసం భూమిని పరిశీలించిన అదనపు కలెక్టర్
హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రజలకు పల్లె సమీపంలో చిట్టడవులు, చిన్నారుల ఆటవిడుపు కోసం అనువైన ప్రదేశాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా హరితహారం మేనేజర్ మణికుమార్, జహీరాబాద్ డివిజన్ అటవీ క్షేత్ర అధికారి విజయ రాణి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఈనెల 25 నుంచి ఆరో విడత హరితహారం చేపట్టాలి : సీఎం కేసీఆర్