ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రతి గురువారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పురవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చెేసిన కార్యక్రమంలో పలువురి సమస్యలను ఆయన విన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
'ప్రజా సమస్యల పరిష్కారానికే పురవాణి కార్యక్రమం' - sangareddy deputy collecter started puravani programe
సంగారెడ్డి జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పురవాని కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ రాజర్షి షా నిర్వహించారు. కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
'ప్రజా సమస్యల పరిష్కారానికే పురవాణి కార్యక్రమం'
పురవాణి కార్యక్రమం ద్వారా 18 మంది తమ సమస్యలు తెలియజేశారని రాజర్షి షా తెలిపారు. కార్యక్రమంలో ప్రజలు అధికశాతం రోడ్డు సమస్యల గురించే తమను అడిగారని వివరించారు. ప్రతి సమస్యను ఖచ్చితత్వంతో పరిష్కరించేలా సంబంధిత అధికారులను అదేశించామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:టీకా తీసుకునేందుకు 80 శాతం మంది రెడీ!