Sangameshwara Basaveshwara Projects : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సింగూరు నుంచి నీటిని మళ్లించేందుకు చేపట్టనున్న సంగమేశ్వర(Sangameshwara), బసవేశ్వర ఎత్తిపోతల(Basaveshwara) పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 4,500 కోట్లతో ఆ పథకాల పనులు ఇంకా ప్రారంభంకానందున నిలిపివేసి ప్రత్యామ్నాయాలు మార్గాలను ఆలోచించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సింగూరుకు నీటిని మళ్లించి 20 టీఎంసీల వినియోగంతో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రెండుఎత్తిపోతల పథకాలను గత ప్రభుత్వం చేపట్టింది.
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం - నీళ్లొచ్చేనా? పంట పండేనా?
SangameshwaraLift IrrigationScheme: 12 టీఎంసీల సామర్ధ్యంతో 2.19 లక్షల ఎకరాలకు నీరందించే సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులను 2,653 కోట్లతో చేపట్టేందుకు 2021 సెప్టెంబరులో అప్పటి ప్రభుత్వం పరిపాలనా అనుమతిచ్చింది. జహీరాబాద్, నారాయణ ఖేడ్, ఆందోల్ నియోజకవర్గాల్లో ఎత్తిపోతల ఆయకట్టు ఉంది. టెండర్లు పిలిచి 2,337 కోట్లకు గుత్తేదారుతో ఒప్పందం కుదిరింది. మూడు పంపుహౌస్‌లు నిర్మించే ఈ పథకానికి 140 మెగావాట్ల విద్యుత్తు అవసరం. 206.4 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వ తవ్వాల్సి ఉంది.
BasaveshwaraLift IrrigationScheme :8 టీఎంసీల నీటి వినియోగంతో 1.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు 1,774 కోట్లతో బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని 2021లో చేపట్టారు. టెండర్ పిలిచి 1,428 కోట్లకు గుత్తేదారుతో ఒప్పందం చేసుకొన్నారు. ఆ పథకానికి 70 మెగావాట్ల విద్యుత్ అవసరం. రెండేళ్లలో పనులు పూర్తిచేసేలా ఒప్పందం చేసుకున్నా నిధుల సమస్యతో ప్రారంభం కాలేదు. నాబార్డు రుణంకోసం ప్రయత్నించగా మొత్తంకాకుండా 2 వేల కోట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినా పథకాలు ముందుకు సాగలేదు.