Samhita Microsoft Job 52 lakh package : కష్టపడాలనే ఆలోచన ఉండాలే గానీ.. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనేందుకు ఓ అమ్మాయి నిదర్శనంగా నిలుస్తోంది. లక్షల ప్యాకేజీలు ఈరోజుల్లో సాధారణమైపోయాయి. కానీ దానిని సాధించేందుకు ఆ యువతి మొదటి సంవత్సరం నుంచే ఆ దిశగా అడుగులేస్తు ముందుకు సాగింది. మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్ కోసం వెళ్లి.. అదే సంస్థలో అరకోటి ప్యాకేజీఉద్యోగాన్ని అవలీలగా పట్టేసింది.
Samhitha Success Story in Sangareddy : సంగారెడ్డి జిల్లా ముదిమాణిక్యం గ్రామానికి చెందిన సంహిత అనే యువతి చిన్నప్పటి నుంచి చదువుల్లో ముందు ఉండేది. పుష్పలత, విష్ణువర్ధన్ రెడ్డిలు ఆమె తల్లిదండ్రులు. సంహిత ఇంటర్మీడియట్ పూర్తిచేసిన తరువాత ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించింది. ప్రస్తుతం నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ కాలేజీ(BVRIT College)లో సీఎస్‌ఈ నాలుగో సంవత్సరం చదువుతోంది. నిత్యం ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవాలనే సంకల్పమే తనను ఈ స్థాయికి చేర్చిందని చెబుతోంది. తనకు గురువులు చేసిన సాయం మర్చిపోలేనని తెలిపింది.
BTech Student Microsoft Job 52 Lakh Package: గురువుల సూచనలు, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే రూ.52 లక్షల ప్యాకేజీ అందుకునే స్థాయికి చేరానని సంహిత చెప్పింది. అయితే తనలో నేర్చుకోవాలనే తపన ఉన్న విషయాన్ని కళాశాల గుర్తించిందని చెబుతోంది. దాంతో పాటు తన భవిష్యత్ ప్రణాళికల వివరాలను తెలిపింది. గతంలో మైక్రోసాఫ్ట్(MicroSoft Job)లో ఇంటర్న్‌షిప్ కోసం వెళ్లినప్పుడు నెలకు లక్ష 25 వేల రూపాయల స్టైఫండ్‌తో మూడు నెలలు పూర్తిచేసింది. తర్వాత అందులోనే ఉద్యోగాన్ని సాధించింది. నేర్చుకోవాలనే కోరిక ఉంటే ఏదైనా సాధ్యమేనని.. తన జూనియర్లకు కూడా సలహాలిస్తోంది.
SI Hemalatha interview in Tealangana : 'నా విజయంలో కుటుంబంతో పాటు ఈనాడు పేపర్ కీలకంగా నిలిచింది'