"సేవ్ ఆర్టీసీ" అంటూ పెద్ద ఎత్తున నినాదిస్తూ సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. కలెక్టరేట్లో డీసీఎల్కి వినతిపత్రం అందజేశారు. కార్మికులకు రావాల్సిన వేతనాలు వెంటనే చెల్లించి... ఎటువంటి షరతులు లేకుండా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సంగారెడ్డిలో "సేవ్ ఆర్టీసీ" ర్యాలీ - సంగారెడ్డిలో సేవ్ఆర్టీసీ పేరుతో కార్మికుల నిరసన ర్యాలీ
ఆర్టీసీని పరిరక్షించాలని కోరుతూ సంగారెడ్డిలో కార్మికులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన నిరసనలో కార్మికులు, పలు రాజకీయ పార్టీ నేతలు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో "సేవ్ ఆర్టీసీ" ర్యాలీ