మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని.. ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. కొవిడ్ నుంచి ఆర్టీసీ కార్మికులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిపో ఎదుట ఆందోళన చేపట్టారు.
'ఆర్టీసీ కార్మికులకు కొవిడ్ నుంచి భద్రత కల్పించండి'
కొవిడ్ నుంచి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు.. ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిపో ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు.
rtc workers protest
హైదరాబాద్, తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో.. కరోనా వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని నాయకులు డిమాండ్ చేశారు. కొవిడ్ బారిన పడ్డ సిబ్బందికి 21 రోజుల వేతనంతో కూడిన సెలవులు అమలు చేయాలన్నారు.
ఇదీ చదవండి:'చావుబతుకుల్లో ఉన్నా అనుమతించడం లేదని ఆవేదన'