'ప్రజల్లో ఆర్టీసీపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి' - rtc drivers
రోడ్డు ప్రమాదాలు జరక్కుండా డ్రైవర్లు అప్రమత్తంగా బస్సులు నడపాలని బీహెచ్ఈఎల్ డిపో ఆర్టీసీ డీఎం సత్యనారాయణ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో నిర్వహిస్తోన్న ప్రమాదరహిత వారోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు, కండక్టర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
'ప్రజల్లో ఆర్టీసీపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి'
ఆర్టీసీ ప్రయాణమంటే సురక్షితం, సుఖవంతం అనే నమ్మకం ప్రజల్లో ఉందని దాన్ని కాపాడుకోవాలంటే డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని బీహెచ్ఈల్ డిపో ఆర్టీసీ డీఎం సత్యనారాయణ అన్నారు. చరవాణి మాట్లాడుతూ ఇతర కార్యకలాపాలపై దృష్టి సారించి వాహనం నడపొద్దని హెచ్చరించారు. ఈనెల 22 నుంచి 28 వరకు ప్రమాదరహిత వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.