ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన కార్మిక చైతన్య యాత్ర ఆదివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ డిపో ఎదురుగా కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని లేనిపక్షంలో సంస్థ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: టీఎంయూ - ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక చైతన్య యాత్రను నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చేరుకున్న నేపథ్యంలో స్థానిక డిపో ఎదురుగా కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: టీఎంయూ
Last Updated : Jul 7, 2019, 8:58 PM IST