మెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. మాస్కులు ధరించిన ప్రయాణికులనే ప్రయాణానికి అనుమతిస్తున్నామని డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్ తెలిపారు. మొదటి రోజు 50శాతం బస్సులతో పరిమిత సంఖ్యలో బస్సులు నడిపినట్లు వెల్లడించారు.
"మాస్కులు ధరించిన.. ప్రయాణికులకే అనుమతి"
లాక్‌డౌన్ కారణంగా.. డిపోలకే పరిమితమైన బస్సులు రోడ్లెక్కాయి. ప్రయాణికుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా శానిటైజర్, ప్రయాణికులు విధిగా మాస్క్‌లను ధరించేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
"మాస్కులు ధరించిన.. ప్రయాణికులకే అనుమతి"
కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా సిబ్బందికి శానిటైజర్, మాస్క్ లు అందజేసినట్లు పేర్కొన్నారు. బస్సులో సింగిల్ సీట్లో ఒకరు, ముగ్గురు కూర్చోడానికి వీలున్న సీటులో ఇద్దరిని మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేశామన్నారు.
ఇదీ చూడండి:'కమీషన్ల కోసం 4 జిల్లాలను ఎండబెడుతున్నారు'