పొలాల్లో అంతర పంటగా సాగుచేస్తున్న రూ.12 లక్షల విలువైన గంజాయి మొక్కలను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. మొగుడంపల్లి మండలం సజ్జారావుపేటతండా శివారులోని నాలుగు ఎకరాల చెరకు, సోయ పంటతోపాటు గంజాయి మొక్కలను సాగుచేస్తున్నారు. మొత్తం 2478 గంజాయి మొక్కలను గుర్తించిన అధికారులు దహనం చేశారు. తెలంగాణ-కర్ణాటక సరిహద్దు పొలాలు కావటం వల్ల పోలీసుల కదలిక ఉండదనే ధీమాతో ఇద్దరు రైతులు నిషేదిత పంటను సాగు చేస్తున్నట్లు ఆబ్కారీ అధికారులు తెలిపారు. పోలీసుల రాకను గుర్తించి రైతులిద్దరూ పరారయ్యారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు.
చెరకు మాటున గంజాయివనం - Rs 12 lakh GANJAI CROP in sugarcane crop
మేడిపండు పద్యం బాగా అర్థమైనట్టుంది ఈ ఇద్దరు రైతులకు... అధికారుల కళ్లుగప్పి గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత పంట సాగుచేస్తున్నాడు. బయటి నుంచి చూస్తే చెరకు, సోయా పంట... కానీ లోపలికెళ్లితే మాత్రం లక్షల విలువచేసే గంజాయి వనం...
Rs 12 lakh GANJAI CROP in sugarcane crop