Special story on Room to Read organization: గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల్లో నైపుణ్యం ఉన్నా వారికి తగిన ప్రోత్సాహకం అందించడానికి కొంత మంది వెనుకడుగు వేస్తారు. అలాంటి నైపుణ్యమున్న విద్యార్థులకు తాము ఉన్నామంటూ అండగా నిలుస్తోంది రూమ్ టు రీడ్ సంస్థ. సంగారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలను నెలకొల్పి విద్యార్థుల అభివృద్దికి రూమ్ టు రీడ్ సంస్థ తోడ్పటు అందిస్తోంది. ఈ సంస్థ 15 దేశాల్లో సేవలు కొనసాగిస్తున్నారు. 40,800 గ్రంథాలయాలు నెలకొల్పి పిల్లలు చదువుకునేలా ప్రోత్సాహం అందిస్తోంది.
సంగారెడ్డి జిల్లాలో 2019లో సేవలు ప్రారంభమై ప్రస్తుతం సదాశివ పేట, సంగారెడ్డి, పటాన్చెరు మండలాల్లో కార్యక్రమం నిర్వహిస్తోంది. మూడు మండలాల్లో కలిపి 33 పాఠశాలలని ఎంపిక చేసుకుని నాలుగు లక్షలు ఖర్చు చేసి ఓ గదిలో పుస్తకాలను నెలకొల్పారు. ఆ గది పిల్లలను ఆకర్షించే విధంగా బొమ్మలు, ఇతర సామగ్రిని ఉంచారు. విద్యార్థులతో పాటు వారుితల్లిదండ్రుల్లో విద్యా నైపుణ్యం పెంచాలనే భావనతో వారిని కూడా ప్రోత్సహిస్తున్నారు.
ఈ సంస్థ పుస్తకాలను పిల్లల ఇంటికే ఇస్తుంది. రూమ్ టు రీడ్ సంస్థ భవిష్యత్తులో దశల వారీగా ప్రతి పాఠశాలకు తమ సౌకర్యాలను అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపింది. పిల్లలు రాయడం, చదవడంలో ప్రావీణ్యం పొందటమే సంస్థ ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారం అందిస్తున్నారని నిర్వాహకురాలు కోట గీత తెలిపారు.