Road Accidents on National Highway 44 :జాతీయ రహదారులపై నిర్వహణ లోపం.. వాహనదారుల పాలిట శాపంగా మారుతోంది. రోడ్డు మీద ఉన్న భయంకరమైన మూలమలుపులకు తోడు... సూచికలు లేకపోవడంతోప్రయాణికులు ప్రమాదాల(Raod Accidents on NH44) బారిన పడుతున్నారు. నిర్వాహకులకు టోల్ రుసుం వసూళ్లపై ఉన్న ఏకాగ్రత... రహదారుల పర్యవేక్షణపై కరవైందంటూ వాహనదారులు వాపోతున్నారు. మెదక్ జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలు... అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయంటున్నారు. ప్రభుత్వ లోపం వల్లే జాతీయ రహదారులు ఇలా నిర్మించబడ్డాయని దాని వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు వాపోతున్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలు రోడ్డునా పడుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
Cause of Road Accidents on NH-44 :మెదక్ జిల్లా తూప్రాన్ మీదుగా వెళ్తున్న 44వ జాతీయ రహదారిపై (National Highway 44) ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారు. తరచూ ఎక్కడో ఒకచోట జరుగుతున్న ప్రమాదాల కారణంగా.. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రహదారిపై భయంకరమైన మూలమలుపులకు తోడు... సూచికలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. పలుచోట్ల బ్లాక్‌స్పాట్లు ఏర్పాటు చేసినా.. వాటి నిర్వహణ మాత్రం అస్తవ్యస్తంగా ఉంది.
ఈ రహదారిపై గడిచిన రెండు నెలల వ్యవధిలో 15మంది మరణించారంటే.. వాటి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా అధికారులు రోడ్డు నిర్మాణ పనులు మంచిగా చేయాలని కోరారు. కాాగా ప్రభుత్వం ఇది వరకే టోల్ వసూళ్లపై తగు మార్పులు చేస్తున్నట్లు ప్రకటించినా... చెడిపోయిన రోడ్ల పునఃనిర్మాణ పనుల గురించి ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. మరోవైపు రోడ్డు ప్రమాదాలు పెరగడానికి కారణం హైస్పీడ్, శిరాస్త్రం ధరించకపోవడం కారణాలు. కొందరు ఆకతాయిలు హైవేలపై వేళ్లాల్సిన స్పీడ్ కంటే ఎక్కువ వేగం వెళ్లడమే కారణం. ట్రాఫిక్ అధికారులు ఈ విషయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన, ఆకతాయిలపై చర్యలు చేపట్టినా కూడా మార్పులు రాకపోవడం బాధకరం.