సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో స్కూటీని లారీ ఢీకొన్న ఘటనలో వ్యక్తి సహా ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని విద్యావాహిని పాఠశాల నుంచి చిన్నారులను స్కూటీపై ఇంటికి తీసుకెళ్తుండగా కుమార్ హోటల్ కూడలిలో లారీ.. స్కూటీ హ్యాండిల్కి తాకుతూ వెళ్ళింది. ప్రమాదంలో వాహబ్ సహా చిన్నారులు ఫకీయా సమమ్, ఫర్దమ్ సదీమ్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడం వల్ల హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్కూటీని ఢీకొన్న లారీ.. ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు - జహీరాబాద్లో స్కూటీని ఢీకొన్న లారీ
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో స్కూటీని లారీ ఢీకొన్న ఘటనలో వ్యక్తి సహా ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
స్కూటీని ఢీకొన్న లారీ