సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ శివారులోని 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆర్షద్ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా.. మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. సంగారెడ్డి నుంచి సదాశివపేట వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆర్షద్, రాజుల వాహనాన్ని ఇన్నోవా వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్షద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ సురేందర్ రెడ్డి తెలిపారు. మృతుడిది మెదక్ జిల్లా నర్సాపూర్ అని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి... తదుపరి విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.
సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - ROAD_ACCIDENT in Sangareddy
సంగారెడ్డి జిల్లా సదాశివపేట శివారులోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి
TAGGED:
ROAD_ACCIDENT in Sangareddy