సంగారెడ్డి శివారులోని ఎంఎన్ఆర్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని అటువైపు నుంచి వస్తున్న తుఫాన్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న సుధాకర్, చక్రధర్ అనే ఇద్దరు వ్యక్తులకి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికత్స పొందుతూ సుధాకర్ అనే వ్యక్తి మరణించాడు. మెరుగైన వైద్యం కోసం చక్రధర్ను హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న తుఫాన్.. ఒకరు మృతి - road accident latest news
సంగారెడ్డి శివారులో ద్విచక్ర వాహనాన్ని తుఫాన్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న తుఫాన్.. ఇద్దరికి గాయాలు
Last Updated : Dec 9, 2019, 8:01 PM IST