సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి సమీపంలోని నారింజ వాగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. కోహిర్లో ఆదివారం జరిగిన పెళ్లిలో గినియర్ పల్లికి చెందిన దత్తాత్రి, కోహిర్కు చెందిన తేజ బైక్పై పోతిరెడ్డిపల్లి వైపు వచ్చారు. వాహనం అదుపు తప్పి నారింజ వాగు మలుపు వద్ద ముళ్ల పొదల్లో పడి అక్కడికక్కడే మృతి చెందారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి - సంగారెడ్డి జిల్లా వార్తలు
సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి సమీపంలోని నారింజ వాగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
![రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8204045-620-8204045-1595933401411.jpg)
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
పెళ్లికి వెళ్లిన ఇద్దరు యువకులు ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబీకులు వెతికినా... ఆచూకీ లభించలేదు. సోమవారం సాయంత్రం ముళ్ల పొదల నుంచి దుర్వాసన రాగా గుర్తించిన బాటసారులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... మృతులను గుర్తించారు. కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.