సంగారెడ్డి జిల్లా మనూరు మండలం డోవురు హనుమాన్ ఆలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఈ ఘటనలో మనూరు మండలం అతిమ్యాల గ్రామానికి చెందిన మెయిజ్ (23) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన మరో ద్విచక్ర వాహనదారుడు పారిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ.. ఒకరి మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా మనూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. ఒక ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే చనిపోగా.. ప్రమాదానికికారణమైన మరో ద్విచక్ర వాహనదారుడు పరారయ్యాడు.
రెండు బైకులు ఢీ.. ఒకరి మృతి