తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాతో ఆర్​ఎంపీ వైద్యుడు మృతి.. జేసీబీతో అంత్యక్రియలు - covid-19 latest news

కరోనా సోకి చికిత్స పొందుతున్న ఓ ఆర్​ఎంపీ వైద్యుడు మృతి చెందాడు. ఆయన స్వగ్రామమైన సుల్తానాబాద్​కు మృతదేహాన్ని తరలించగా... స్థానికులు అంత్యక్రియలకు సహకరించలేదు. అధికారులు, పోలీసులు జేసీబీతో గోతి తవ్వి అంత్యక్రియలు నిర్వహించారు.

rmp doctor died with corona in gandhi hospital
కరోనా సోకి ఆర్​ఎంపీ వైద్యుడు మృతి.. జేసీబీతో గోతి తవ్వి అంత్యక్రియలు

By

Published : Jul 16, 2020, 7:01 PM IST

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని సుల్తానాబాద్​కు చెందిన ఒక ఆర్​ఎంపీ వైద్యుడు కరోనా సోకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృత దేహాన్ని స్వగ్రామమైన సుల్తానాబాద్ తరిలించగా.. అక్కడ స్థానికులు అంత్యక్రియలకు సహకరించలేదు. దీంతో పోలీసులు, పంచాయతీ అధికారులు మృతదేహానికి నల్లవాగు ప్రాజెక్టు సమీపంలో జేసీబీతో గోతి తవ్వి అంత్యక్రియలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details