సంగారెడ్డి జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలో బాహ్య వలయ రహదారి పక్కన 191 సర్వేనెంబర్లో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు ఆక్రమించారు. దీనిపై ఈనాడు ఈటీవీభారత్లో కథనాలు వచ్చాయి. దీనిపై అధికారులు వెంటనే స్పందించారు. ఆక్రమణకు గురైన భూమి సర్వే చేసేందుకు సర్వే ల్యాండ్ అండ్ రికార్డ్స్, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టారు.
కొల్లూరు భూ ఆక్రమణలపై స్పందించిన అధికారులు - తెలంగాణ వార్తలు
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు 191 సర్వేనెంబర్లో ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఈనాడు-ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. వెంటనే ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని సర్వే చేసేందుకు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే చేపట్టాయి.
భూ ఆక్రమణ
అధికారులు సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసి.. పాయింట్లను పరిశీలించారు. ప్రస్తుతం పాయింట్లు గుర్తిస్తున్నామని సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ మధుసూదన్ రావు తెలిపారు పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత స్థానికుల అభిప్రాయం కూడా తీసుకుంటామని ఆయన చెప్పారు వచ్చిన ఫిర్యాదుపై పూర్తిస్థాయిలో సర్వే చేయవలసి ఉందని.. సర్వే చేసిన తర్వాతే ఒక స్పష్టత వస్తుందని చెప్పారు.
ఇదీ చదవండి:CM KCR REVIEW: నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష