సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లిలో ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. సర్వే నెం161 లోని కట్టడాలను నేలమట్టం చేశారు. గత 20 ఏలళ్ల క్రితమే బంగారం కుదువపెట్టి మరీ స్థలాన్ని కొన్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
'బంగారం కుదువపెట్టి కొన్న స్థలాన్ని లాక్కుంటుర్రు' - Sangareddy District Latest News
సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. అక్రమంగా నిర్మిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 20 ఏళ్ల క్రితమే స్థలాన్ని కొన్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేత
కూల్చివేతను బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంతో కష్టపడి కొనుకున్న భూములను లాక్కోవడం అన్యాయమని ఆరోపించారు. స్థానిక నేతలు, కలెక్టర్ న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చెపడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చూడండి:విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఆధునికత