సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్ గ్రామంలో 195 సర్వే నెంబరు గల 26 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లు, షెడ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. సుమారు 70 కుటుంబాలు ఈ భూముల్లో తమ పూర్వీకుల నుంచి ఉంటున్నట్లు బాధితులు చెబుతున్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వచ్చి కూల్చి వేయడం న్యాయమా అని బాధితులు ప్రశ్నించారు.
భూమి లాక్కునే అధికారులు.. ఇవే స్థలాలపై పన్నులు ఎందుకు వసూలు చేశారని నిలదీశారు. బాధితులు తాము కాయకష్టం చేసి గూడు నిర్మించుకుందామనే ఉద్దేశంతో ఇళ్లు కట్టుకుంటే కనికరం లేకుండా కూల్చి వేయడం సరికాదన్నారు. ప్రభుత్వ అధికారుల కాళ్లా వేళ్లా పడ్డా దయ చూపలేదని వాపోయారు.