తెలంగాణ

telangana

రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ

By

Published : Apr 11, 2020, 7:36 PM IST

కరోనా విపత్తు కాలంలో రెవెన్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు అన్నారు. ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో పని చేస్తున్న కార్మికులకు రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరకులతో కూడిన 1000 కిట్లను అందజేశారు.

revenue employees union distributed food items at idl bollaram sangareddy district
రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ

సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని పరిశ్రమలల్లో పని చేయడానికి వచ్చిన కార్మికులు, పేదలకు రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రెవిన్యూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డితో కలిసి జిల్లా పాలనాధికారి హనుమంతరావు నిత్యావసర వస్తువులతో కూడిన 1000 కిట్లను అందించారు. పదిహేను రోజూల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదనే ఉద్దేశంతో ఈ కిట్లు పంపిణీ చేశారు. మరో 500 కిట్లును అందించనున్నట్లు స్థానిక తహసీల్దార్​ తెలిపారు.

ఏ రాష్ట్రం నుంచి వచ్చినవారైనా ఆకలితో ఉండకూడదన్న కేసీఆర్ సూచన మేరకు రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజలంతా లాక్​డౌన్​లో స్వచ్ఛందంగా పాల్గొన్నాలని జిల్లా పాలనాధికారి కోరారు.

ఇదీ చూడండి:కరోనాపై ఆందోళన వద్దు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు!

For All Latest Updates

TAGGED:

Revenue

ABOUT THE AUTHOR

...view details