'ఇంటి వద్దే మాల విరమణ చేయండి' - Hanuman Jayanti Celebrations
హనుమాన్ మాల దీక్షను భక్తులు తమ ఇంటి వద్దే తల్లితండ్రుల చేతుల మీదుగా మాల విరమణ చేయాలని దీక్ష రూపకర్త శ్రీ దుర్గా ప్రసాద్ స్వామి ఆదేశించారు. లాక్డౌన్ నిబంధనల వల్ల కండ్లకోయ వద్ద ఉన్న ఆశ్రమంలోనూ మాల విరమణ కార్యక్రమాలు లేవని ఆయన సంగారెడ్డిలో స్పష్టం చేశారు.
'ఇంటి వద్దే మాల విరమణ చేయండి'
ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా దీక్ష చేపట్టిన భక్తులు ఇళ్ల వద్దే మాల విరమణ చేయాలని శ్రీ దుర్గా ప్రసాద్ స్వామి తెలిపారు. కరోనా నివారణ, లోక కల్యాణం కోసం సంకల్పించిన కోటి హనుమాన్ చాలీసా పరిపూర్ణమైందని పేర్కొన్నారు. భారత్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు ప్రతి రోజు చాలీసా పారాయణం చేశారన్నారు. భక్తులందరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచించారు.