సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లక్డారం గ్రామంలో కంకర మిల్లుల వల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని పాలనాధికారి కార్యాలయంలో గ్రామస్థులు వినతి పత్రాన్ని అందించారు. కంకర మిల్లుల వల్ల గ్రామంలో దుమ్మూ, ధూళి ఎక్కువ అవుతుందని గ్రామస్థులు ఆరోపించారు. ప్రజలందరూ రోగాల పాలవుతున్నారని వాపోయారు. ప్రస్తుతం ఉన్న 12 మిల్లులే కాకుండా.. కొత్తవి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఉన్నవాటితోనే ఇబ్బంది పడుతుంటే కొత్తవి ఎందుకని ప్రశ్నించారు.
'పాతవి తొలగించండి.. కొత్తవాటికి అనుమతి ఇవ్వకండి' - crusher mills problem at lakdaram in patancheru
పటాన్చెరు మండలం లక్డారం గ్రామస్థులు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రాన్ని అందించారు. కంకర మిల్లుల వల్ల గ్రామంలో దుమ్మూ, ధూళి ఎక్కువ అవుతోందని పేర్కొన్నారు. గ్రామంలో ఇప్పటికే ఉన్న మిల్లులను తొలగించి, కొత్త వాటిని అనుమతించవద్దని వారు కోరారు.

'పాతవి తొలగించండి.. కొత్తవాటికి అనుమతి రద్దు చేయండి'
వ్యవసాయంపైనా ప్రభావం పడి దిగుబడి తగ్గుతుందన్నారు. వాటి శబ్దంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. కొత్త మిల్లులకు చెరువు పక్కన అనుమతి ఇవ్వడంతో చెరువు నాశనం అవుతుందని పేర్కొన్నారు. ఇళ్లలోకి దుమ్ము విపరీతంగా వస్తోందని వివరించారు.
ఇదీ చూడండి: ఉపాధి ఊతం.. సింగరేణితో కొత్త జీవితం!