తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మకు అండగా నిలిచారు.. అక్కున చేర్చుకున్నారు.. - వృధురాలికి ఓస్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులు అండ

కుటుంబాన్ని కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న ఓవృద్ధురాలికి.. తాము అండగా ఉంటామంటూ మనసున్న కొందరు ముందుకొచ్చారు. 30కిలోల బియ్యం, నెలకు సరిపడే నిత్యావసరాలతో పాటు నాలుగు చీరలు, అవసరమైన దుప్పట్లు అందించారు. ఆమె అవసరాలను గుర్తించి ప్రతినెలా వాటిని తామే స్వయంగా అందిస్తామని వివరించారు.

Representatives Supports to  Lakshmamma
లక్ష్మమ్మకు దొరికింది... మనసున్న వారి అండ

By

Published : May 12, 2020, 11:43 AM IST

కూడు, గూడు లేని ఓ వృద్ధురాలికి ఓస్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులు అండగా నిలిచారు. సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటకు చెందిన లక్ష్మమ్మ అనే వృద్ధురాలికి ఎవరూ లేరు. ఆమె గుడిసె పక్కనే నివసించే నర్సమ్మ కుటుంబం ఆ వృద్ధురాలికి అండగా ఉంటోంది. భోజనం పెట్టడంతో పాటు ఇతర సపర్యలూ చేస్తున్నారు. ఈ విషయాన్ని ‘ఆకలితో అల్లాడితే... చూస్తూ ఊరుకోదు ‘అమ్మ’’ శీర్షికన ‘ఈనాడు’ చిత్ర కథనాన్ని అందించింది.

సంగారెడ్డికి చెందిన మనసేవా సమితి ప్రతినిధులు స్పందించారు. నర్సమ్మకు సరకులు ఇచ్చి మరింత బాగా చూసుకోవాలని కోరారు. ఏ సంబంధం లేకున్నా ఆమె బాగోగులు చూస్తున్న నర్సమ్మను అభినందించారు. వృద్ధురాలు నివసిస్తున్న ప్రాంతం తీవ్ర దుర్గంధభరితంగా ఉండటం గుర్తించి.. వారం రోజుల్లోగా దీనిని మొత్తం శుభ్రం చేయించి పకడ్బందీగా ఉండేలా గుడిసెను నిర్మించి ఇస్తామని తెలిపారు.

ఇవీ చూడండి:ప్రాథమిక సమాచారం ఉంది..రైల్వే సిబ్బంది అస్వస్థత నిజమే

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details