సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. జహీరాబాద్ పట్టణ శివారులో నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని డీసీఎం వాహనంలో లోడ్ చేస్తుండగా అక్కడికి అధికారుల బృందం చేరుకుంది.
అక్రమంగా తరలిస్తోన్న రేషన్ బియ్యం పట్టివేత - illegal transport of ration rice in sangareddy
అత్యవసర బియ్యం సరఫరా పేరిట అధికారుల వద్ద పాస్ తీసుకుని రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నించిన వారిని సంగారెడ్డి జహీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. సుమారు 100 క్వింటాళ్లకు పైగా బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

జహీరాబాద్లో రేషన్ బియ్యం పట్టివేత
ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన సుమారు 100 క్వింటాళ్లకు పైగా బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని అక్రమార్కులు మహారాష్ట్రకు తరలించేందుకు యత్నించినట్లు తెలిపారు.
బియ్యం అక్రమ నిల్వకు పాల్పడిన అక్రమార్కులు అత్యవసర బియ్యం సరఫరా పేరిట అధికారుల నుంచి పాస్ పొందడం గమనార్హం. అక్రమ నిల్వలకు పాల్పడిన వ్యక్తులు, బియ్యం సేకరణపై అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.