రేషన్ పొందాలంటే ఆధార్ అనుసంధానం అయిన మొబైల్ ఫోన్ నెంబర్ అవసరం. కానీ అనుసంధానం చేసుకునేందుకు ఆధార్ సెంటర్లు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో స్థానికులు ఆందోళనకు దిగారు.
తెరుచుకోని ఆధార్ సెంటర్... రోడ్డెక్కిన లబ్ధిదారులు - సంగారెడ్డి తాజా వార్తలు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో స్థానికులు ఆందోళనకు దిగారు. ఆధార్ కేంద్రం తెరుచుకోకపోవడం వల్ల రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు.
![తెరుచుకోని ఆధార్ సెంటర్... రోడ్డెక్కిన లబ్ధిదారులు తెరుచుకోని ఆధార్ సెంటర్... రోడ్డెక్కిన లబ్ధిదారులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10482287-thumbnail-3x2-srd-rk.jpg)
తెరుచుకోని ఆధార్ సెంటర్... రోడ్డెక్కిన లబ్ధిదారులు
మొబైల్ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకునేందుకు ఆధార్ సెంటర్‌కు రాగా... సకాలంలో దానిని తెరవకపోవడం వల్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలకు ఒకే ఆధార్ సెంటర్ ఉండడం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఇదీ చూడండి:వరిపొలంలోకి దూసుకెళ్లిన ఆటో.. 18 మందికి తీవ్రగాయాలు