సంగారెడ్డిలోని దత్తగిరి ఆశ్రమంలో రాజశ్యామల నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. బర్దిపూర్ అవధూతగిరి మహారాజ్ ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజుల నుంచి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని.. స్వామివారి దీవెనలు అందుకున్నారు. నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. పలువురు దంపతులు హోమ కార్యక్రమాలు నిర్వహించి.. స్వామి ఆశీస్సులు అందుకున్నారు.
ఘనంగా రాజశ్యామల నవరాత్రి మహోత్సవాలు - ఘనంగా రాజశ్యామల నవరాత్రి మహోత్సవాలు
సంగారెడ్డిలోని దత్తగిరి ఆశ్రమంలో బర్దిపూర్ అవధూతగిరి మహారాజ్ ఆధ్వర్యంలో రాజశ్యామల నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
![ఘనంగా రాజశ్యామల నవరాత్రి మహోత్సవాలు Rajya Shamala CHANDI HOMAM in Sangareddy District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5951912-399-5951912-1580803082734.jpg)
ఘనంగా రాజశ్యామల నవరాత్రి మహోత్సవాలు