తెలంగాణ

telangana

ETV Bharat / state

గీతారెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్‌ గాంధీ జయంతి వేడుకలు - rajiv_gandhi_jayanthi_geetareddy_zahirabad

జహీరాబాద్ పట్టణంలో రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి గీతారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ అతిథి గృహం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన చేపట్టారు.

గీతారెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్‌ గాంధీ జయంతి వేడుకలు

By

Published : Aug 20, 2019, 8:04 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి గీతారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ అతిథి గృహం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి గీతారెడ్డి నివాళులర్పించారు. 75 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని యువజన కాంగ్రెస్ ఎన్ఎస్‌యూఐ విద్యార్థి నాయకులు రక్తదానం చేశారు. రక్తదాన శిబిరాన్ని గీతారెడ్డి సందర్శించి యువ నాయకుల స్ఫూర్తిని అభినందించారు. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటులో రాజీవ్ గాంధీ కీలకమని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

గీతారెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్‌ గాంధీ జయంతి వేడుకలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details